1990 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(IAS) అధికారి కెఎస్ జవహర్ రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పూనమ్ మాలకొండయ్యను సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి కేఎస్ జవహర్ రెడ్డి ఆ బాధ్యతల్లో ఉంటారు. జూన్ 30, 2024 వరకు పదవిలో కొనసాగుతారు. జవహర్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా జవహర్ రెడ్డి పనిచేశారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి