Gujarat : గుజరాత్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసినందుకు 6 సార్లు ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ్, ఇద్దరు మాజీ శాసనసభ్యులుతో సహా 12 మంది పార్టీ నేతలను బీజేపీ సస్పెండ్ చేసింది.
డిసెంబర్ 1న జరగనున్న తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసినందుకు ఏడుగురు బీజేపీ నేతలు సస్పెన్షన్‌కు గురైన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు మరో 12 మంది నేతలు, బీజేపీ అధికారిక అభ్యర్థులపై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. వీరిని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సస్పెండ్ చేశారు.
182 అసెంబ్లీ స్థానాల్లో మొదటి దశలో 89, రెండో దశలో 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి